Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‏లో యాంకర్ సుమను ఆటాడుకున్న రచ్చ రవి.. నీ కాళ్లు మొక్కుతా బాంచెన్ అంటూ..

నీ కాళ్లు మొక్కుతా బాంచెన్.. నా సొంత ఊరిలో చిరంజీవి అన్నతో నేనున్నా. రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను. మళ్లీ జీవితంలో ఎక్కడా మాట్లాడ.. నన్ను ఆపకు అంటూ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలియచేస్తూనే.. తన స్పీచ్ కు అడ్డుపడుతున్న సుమను విసుక్కున్నాడు.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‏లో యాంకర్ సుమను ఆటాడుకున్న రచ్చ రవి.. నీ కాళ్లు మొక్కుతా బాంచెన్ అంటూ..
Rachcha Ravi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 29, 2023 | 4:44 PM

మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ నిలిచింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం వరంగల్ వేదికగా వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో జబర్ధస్త్ కమెడియన్ రచ్చ రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే స్టేజ్ పై ఉన్న యాంకర్ సుమను ఓ ఆటాడుకున్నాడు. నీ కాళ్లు మొక్కుతా బాంచెన్.. నా సొంత ఊరిలో చిరంజీవి అన్నతో నేనున్నా. రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను. మళ్లీ జీవితంలో ఎక్కడా మాట్లాడ.. నన్ను ఆపకు అంటూ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలియచేస్తూనే.. తన స్పీచ్ కు అడ్డుపడుతున్న సుమను విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

“ఓరుగల్లు నీళ్లు తాగి హైదరాబాద్ వచ్చిన.. కృష్ణానగర్ లో కన్నీళ్లు తాగి బతికిన.. చిరంజీవి అభిమానిగా బతుకుతున్నాను.. చిరంజీవి అభిమాని చిరంజీవి సినిమాకు టికెట్లు చింపుతడు.. పేపర్లు చల్లుతడు. దెబ్బలు తింటడు. ఆ అభిమాని ఆర్టిస్ట్ అయితే.. మీ ముందుంటడు. ఇది స్పీచ్ కాదు. నా ఆవేదన. నా ప్రేమ, దానికి ఏ పేరు పెట్టుకుంటావో పెట్టుకో. పుట్టిన ఊరిలో చిరంజీవి అన్న ముందు ఉన్న. లైఫ్ ఇక చాలు.. ఏం జేత్తవ్ పో ” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తనకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బాబీకి థాంక్స్ చెప్పాడు. అయితే స్పీచ్ ముగించాల్సిందిగా సుమ కోరగా.. ఆగాగు.. దండం పెడతా.. ఇంకొక్కటే అంటూ మళ్లీ చెప్పుకొచ్చాడు.

అంజనమ్మ.. టీవీ చూస్తున్నవా.. మా అందరి కోసం మెగాస్టార్ ను ఇచ్చినవ్.. మా కోసం పవర్ స్టార్ ను ఇచ్చినవ్. ఇండస్ట్రీలో మా బతుకులు మార్చేందుకు నాగబాబు రూపంలో టవర్ స్టార్ ను ఇచ్చినవ్. మీ ముగ్గురు కొడుకులను మా కోసమే ఇచ్చినవ్ కదమ్మా. అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. రవి స్పీ్చ్ ముగిసిన తర్వాత యాంకర్ సుమ మిగతా వాళ్లందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పబోయింది. దీంతో రవి మళ్లీ కల్పించుకుని.. ఓ బుజ్జి.. నువ్వు ముసలిదానివి కాదు ఏం కావు.. వేరేటోళ్లకు ఛాన్స్ ఇయ్యవు.. వాళ్లంతా ఇష్టంతో ఒక్కొక్క మాట మాట్లాడుతరు. హాయ్ బాయ్ చెప్పొద్దా అంటూ సుమను ఆడుకున్నాడు.