
జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా చాలా మంది నటులు పరిచయం అయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా, డైరెక్టర్స్ గా, హీరోలుగా సినిమాలు చేస్తూ దూకుపోతున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ ద్వారా పాపులర్ అయ్యారు ప్రియాంక సింగ్. అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది ప్రియాంక సింగ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ పంచుకుంది. తన తండ్రికి మంచి కూతురుగా ప్రియాంక గానే తిరిగి జన్మించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తల్లిని కోల్పోయినప్పటికీ, తనను పెంచి పెద్దచేసిన మరొక అమ్మ అండగా ఉందని, ఏ సమస్య వచ్చినా పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మనశ్శాంతి పొందుతానని తెలిపింది ప్రియాంక సింగ్. గత 14 ఏళ్లుగా ప్రతీ శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్తానని, లలితా సహస్రనామం పఠిస్తూ, తులసికోట పూజ చేస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతానని ప్రియాంక వెల్లడించారు.
పబ్‌లు, చిల్లింగ్ పార్టీలకు దూరంగా ఉంటూ.. ఇక జబర్దస్త్ షో నేను మానెయ్యలేదు.. వల్లే నన్ను గెంటేశారు. తాను లేడీ గెటప్‌లు వేయడం వల్ల, ఇతర లేడీ గెటప్‌లు ఉన్నందున, షోకి చెడ్డపేరు వస్తుందేమో అని నిర్వాహకులు భావించారని ప్రియాంక తెలిపారు. వాళ్లు అలా అనడంతో వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే, తక్షణమే తన వస్తువులను ప్యాక్ చేసుకొని ఆ షో నుండి బయటకొచ్చాశాను అని ఆమె వెల్లడించారు. బయటకొచ్చిన పది రోజుల్లోనే ప్రియాంక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఆర్థరైటిస్‌తో బాధపడుతూ దాదాపు ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్లిష్ట సమయంలో మెగా బ్రదర్ నాగబాబు తనకు అండగా నిలిచారని, ఆర్థికంగా, మానసికంగా ఎంతో సాయం చేశారని ప్రియాంక సింగ్ తెలిపారు. నాగబాబు ప్రతి నెలా మందులు, డబ్బు పంపించడమే కాకుండా, రోజు కాల్ చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారని గుర్తు చేసుకున్నారు.
నాగబాబు సలహాతోనే తాను మా టీవీ, జీ తెలుగు వంటి ఛానెళ్లలో కామెడీ షోలు చేసి, తిరిగి పరిశ్రమలో నిలదొక్కుకున్నానని ప్రియాంక చెప్పారు. అదే సమయంలో, మా టీవీలో పనిచేస్తున్నప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నుండి పిలుపు రావడంతో, ఎంతో ఆసక్తితో ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. బిగ్ బాస్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, అప్పట్లో తన వయస్సు కేవలం 24 సంవత్సరాలని, బయటి ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేని అమాయకురాలిని అని ఆమె అన్నారు. హౌస్‌లో జరిగిన గొడవలు, సరదా క్షణాలు తనకు ఇంకా గుర్తున్నాయని, ఇప్పటికీ తన బిగ్ బాస్ ఎపిసోడ్‌లను ఒక్కటి కూడా చూడలేదని ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.