Dil Raju: నాలుగో రోజు సినీ నిర్మాతల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఆఫీసులు, ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో మీడియా పై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. ఇక నాలుగో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Dil Raju: నాలుగో రోజు సినీ నిర్మాతల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..
Dil Raju, Mythri Makers

Updated on: Jan 24, 2025 | 7:44 AM

సినీ పెద్దల మీద ఐటీ అధికారులు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ , మ్యాంగో మీడియా ఆఫిసుల పై ఇళ్ల పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఆఫీసులు, ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా నిర్మాతలు, వారి కుటుంబీకులు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిపారు. సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లను కూడా ఓపన్ చేసి తనిఖీలు చేశారు. కృష్ణానగర్‌లోని దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ జరిగాయి. దిల్‌రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్‌పై అధికారులు ఆరా తీశారు.

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఐటీ సోదాలు కొనసాగుతూన్నాయి.. నాలుగో రోజు సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను పరిశీలించారు ఐటీ బృందం. సినిమాల పెట్టుబడులు రాబడలపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఎస్విసి ప్రొడక్షన్స్, మైత్రి, మ్యాంగో సమస్యలపై నాలుగో రోజు ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంక్రాంతికి మూడు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్, అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు వందకోట్లకు పైగానే వసూల్ చేశాయి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.