థియేటర్లోనే ‘ఇష్క్’.. విడుదల ఎప్పుడంటే..? ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్!

టాలీవుడ్‌లో మళ్లీ థియేటర్లలో సందడి మొదలుకానుంది. థియేటర్లు తెరుచుకోనుండడంతో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌.. నాట్‌ ఏ లవ్‌స్టోరి’ సినిమా థియేటర్లో విడుదలకు సిద్ధమైంది.

థియేటర్లోనే 'ఇష్క్'.. విడుదల ఎప్పుడంటే..? ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్!
Teja Sajja Ishq
Venkata Chari

|

Jul 21, 2021 | 9:03 AM

Ishq: టాలీవుడ్‌లో మళ్లీ థియేటర్లలో సందడి మొదలుకానుంది. థియేటర్లు తెరుచుకోనుండడంతో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌.. నాట్‌ ఎ లవ్‌స్టోరి’ సినిమా థియేటర్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. జులై 30 న ఇష్క్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇటీవల ‘జాంబీరెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. దీంతో తన రెండవ సినిమాగా రానున్న ఇష్క్ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు నెట్టింట్లో ఇంకా సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు ఎస్.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఏప్రిల్‌లోనే విడుదలకావల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. థియేటర్లు పునః ప్రారంభం కావడంతో సినిమాని విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఈ సినిమాలో తేజ జోడిగా ప్రియా ప్రకాశ్ వారియర్ రొమాన్స్ చేయనుంది. కొంతకాలంగా ఆమె తెలుగులో సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాతోనైనా తన మార్క్ చూపించాలని ఎదురుచూస్తోంది. తేజ సజ్జ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘హనుమాన్’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇష్క్ సినిమా ఓటీటీలోనే విడుదల చేస్తారనే టాక్ వినిపించింది. ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ కావడంతో ఇష్క్ సినిమాను ప్రేక్షకుల మందుకు తీసుకానున్నారు.

Also Read:

Satyadev: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్..

అదంటేనే భయమేస్తోంది.. ప్లీజ్ వాటినెవరూ టచ్ చేయోద్దంటోన్న గ్లోబల్ స్టార్!

Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu