Vijay Thalapathy Sangeetha : ముక్కలైన 27 ఏళ్ల వివాహ బంధం.. భార్యకు విజయ్ దళపతి రూ.250 కోట్ల భరణం.. ?

ప్రస్తుతం సినీరంగంలో విడాకులు చాలా కామన్ అయ్యాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళ హీరో జయం రవి, ఆర్తి విడాకుల ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, సంగీత డివోర్స్ విషయం అభిమానులకు షాకిచ్చింది.

Vijay Thalapathy Sangeetha : ముక్కలైన 27 ఏళ్ల వివాహ బంధం.. భార్యకు విజయ్ దళపతి రూ.250 కోట్ల భరణం.. ?
Vijay Thalapathy, Sangeetha

Updated on: Mar 07, 2026 | 8:47 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పేరు కొన్నాళ్లుగా వార్తలలో తెగ వినిపిస్తుంది. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలతో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు విజయ్. మొన్నటివరకు రాజకీయాలు.. ఆ తర్వాత జన నాయగన్ సినిమా విడుదల విషయంలో సెన్సార్ ఇష్యూ కారణంగా విజయ్ పేరు వార్తలలో మారుమోగింది. ఇక ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలోనే విజయ్ భార్య సంగీత సొర్నలింగం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందని ఆరోపిస్తూ అతడి నుంచి విడాకులు కావాలంటూ చెంగల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తమ 27 వివాహ బంధానికి ముగింపు పలకాలని సంగీత నిర్ణయం తీసుకోవడం.. విజయ్ పేరును మరో నటితో ముడిపెట్టడంతో సినీప్రియులను ఆశ్చర్యపోయారు.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

అయితే విజయ్, సంగీత విడాకుల విషయం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరు అయ్యాయని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారని.. ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు విజయ్ మరో నటితో ప్రేమలో ఉన్నాడని తన పిటిషన్ లో సంగీత పేర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో హీరోయిన్ త్రిష పేరు తెరపైకి వచ్చింది. విజయ్ హీరోయిన్ త్రిషతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం నడుస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల చెన్నైలోని ఓ వివాహ వేడుకకు విజయ్ త్రిషతో కలిసి హాజరయ్యారు. ఇద్దరు ఒకే రంగు దుస్తులతో కలిసి ఒకే కారులో రావడంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. సంగీతతో పరస్పర అంగీకారం కోసం విజయ్ రూ.250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు సమాచారం. తమ డివోర్స్ విషయాన్ని కోర్టు బయటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి.. సంగీతకు రూ.250 కోట్ల భరణం చెల్లించేందుకు విజయ్ సుముఖత చూపిస్తున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ మాత్రం రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us