
దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార, గత రెండు దశాబ్దాలుగా అగ్రతారగా కొనసాగుతూ వస్తున్నారు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలకు పైగా అవుతుంది. ఇప్పటికీ హీరోయిన్‌గా వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నయనతారతో పాటు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎంతోమంది నటీమణులు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని లేదా అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే నయనతార మాత్రం వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ ప్రధాన పాత్రలలో అవకాశాలు అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నయనతార విజయానికి గల కారణాలను పరిశీలిస్తే, సినిమాల పట్ల ఆమెకున్న అపారమైన ఆసక్తి, ప్రేమ, మరియు ప్రతి పాత్రకు ఆమె చేసే న్యాయమే ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. నయనతార ఏ పాత్రలో అయినా నటించడానికి సంకోచించరు. తనకు కథ నచ్చితే, ఎలాంటి పాత్రలైనా చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా, ఆమె తరచుగా రా ఏజెంట్ లేదా ఏదో ఒక ప్రభుత్వ అధికారి పాత్రల్లో నటించడం గమనించదగ్గ విషయం. తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ, పాత్రకు అనుగుణంగా తనను తాను పూర్తిగా మార్చుకుని లీనమై నటిస్తారు. ఈ అంకితభావమే ఇతర హీరోయిన్లకు దక్కాల్సిన అవకాశాలను కూడా ఆమెకు తెచ్చిపెట్టిందని, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టిందని విశ్లేషకులు చెబుతారు. ఇటీవలి కాలంలో నయనతార కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు.
ఆమె బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు జట్లీ దర్శకత్వంలో, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటి బాలీవుడ్ చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో, నయనతారకు బాలీవుడ్ నుంచి కూడా మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. నయనతార వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్‌తో దాదాపు ఏడు సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఆతర్వాత వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత, ఈ దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. ఇప్పటికీ ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉండటం, పాత్రకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడమే నయనతార రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్రతారగా నిలబడటానికి మూల కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.