Project K: ప్రభాస్ సినిమా టైటిల్ ఇదేనా..? ప్రాజెక్ట్ కే లో కే అంటే అర్ధం అదేనా.. ?

ప్రాజెక్ట్ కె ఇప్పుడు మన డిస్కషన్స్ దాటి, ప్యాన్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ డిస్కషన్స్ లోకి ఎంట్రీ పాస్‌ తీసేసుకుంది. ఆల్రెడీ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, సూపర్‌డూపర్‌ హీరోయిన్‌ దీపిక ఎంట్రీతోనే మాగ్నమ్‌ ఆపస్‌ అనిపించుకుంది ప్రాజెక్ట్ కె.

Project K: ప్రభాస్ సినిమా టైటిల్ ఇదేనా..? ప్రాజెక్ట్ కే లో కే అంటే అర్ధం అదేనా.. ?
Project K

Edited By:

Updated on: Jul 10, 2023 | 11:57 AM

సెట్స్ మీద ఒకటికి నాలుగు సినిమాలుంటే, డిస్కషన్‌ అలాగే ఉంటుంది మరి. మొన్నటికి మొన్న వచ్చి వెళ్లిపోయిన ఆదిపురుష్‌ గురించే మాట్లాడుకుంటారా? ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న సలార్‌ గురించే డిస్కస్‌ చేస్తారా? లేకుంటే, వచ్చే ఏడాది పొంగల్‌కి ప్రిపేర్‌ అవుతున్న ప్రాజెక్ట్ కె గురించి ప్రస్తావించుకుంటారా? అమ్మో.. ఇన్ని టాపిక్స్ లోనూ ఒక్కటి మాత్రం హైలైట్ అవుతోంది. దాని పేరే మిషన్‌ కె.. ఇంతకీ ఏంటంటారా?. ప్రాజెక్ట్ కె ఇప్పుడు మన డిస్కషన్స్ దాటి, ప్యాన్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ డిస్కషన్స్ లోకి ఎంట్రీ పాస్‌ తీసేసుకుంది. ఆల్రెడీ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, సూపర్‌డూపర్‌ హీరోయిన్‌ దీపిక ఎంట్రీతోనే మాగ్నమ్‌ ఆపస్‌ అనిపించుకుంది ప్రాజెక్ట్ కె. మొన్నీమధ్యనే లోకనాయకుడి ఎంట్రీ మరో రేంజ్‌ హైప్‌ ఇచ్చింది.

స్టార్‌ కాస్ట్ గురించి మొత్తం డీటైల్స్ కంక్లూజన్‌కి వచ్చాక, ఇప్పుడు అసలు డిస్కషన్‌ మొదలైంది నెట్టింట్లో. ఇంతకీ కె అంటే ఏంటి? ప్రాజెక్ట్ కె అని ఎందుకు పెట్టినట్టు? ఇందులో ప్రభాస్‌ భగవంతుడి అవతారంగా కనిపిస్తారా? అది కూడా ఫ్యూచర్‌ గాడ్‌గా ప్రత్యక్షమవుతారా? రోజురోజుకీ పెరుగుతున్న అనుమానాలకు అసలు అంతు లేకుండా పోయింది.

ప్రాజెక్ట్ కె లో కె అంటే కాలచక్రమా? కల్కినా? అనేది ఫిల్మ్ నగర్‌లోనే కాదు, ఇంటర్నేషనల్‌ వైడ్‌ ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్‌. డైరక్టర్‌ నాగి ఏదో ఓ సందర్భంలో దీనికి క్లారిటీ ఇస్తే తప్ప ఇమాజినేషన్లకు ఎండ్‌ కార్డు పడదు. అప్పటిదాకా సరదాగా ఎవరికి తోచిన డిస్కషన్స్ వాళ్లు చేసుకోవాల్సిందే డార్లింగ్స్.