Shah Rukh Khan, Salman Khan: బాలీవుడ్ బిగెస్ట్ మూవీ.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్..

మొన్నటివరకు లవ్ స్టోరీలతో అలరించిన ఈ హీరోలు ఇప్పుడు యాక్షన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. షారుఖ్‌ , సల్మాన్‌ ఖాన్‌ సినిమాలు తొలిరోజె భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అయితే ఒకరి సినిమాలో మరొకరు కనిపిస్తూ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఈ హీరోలు. అయితే ఇప్పుడు షారుఖ్ , సల్మాన్ కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది .  ఈ యాక్షన్ హీరోలు కలిసి  ' టైగర్ వర్సెస్ పఠాన్'లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Shah Rukh Khan, Salman Khan: బాలీవుడ్ బిగెస్ట్ మూవీ.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్..
Salman Khan, Shahrukh Khan

Updated on: Sep 17, 2023 | 1:56 PM

బాలీవుడ్ లోభారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ ఇద్దరి సినిమాలు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. మొన్నటివరకు లవ్ స్టోరీలతో అలరించిన ఈ హీరోలు ఇప్పుడు యాక్షన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. షారుఖ్‌ , సల్మాన్‌ ఖాన్‌ సినిమాలు తొలిరోజె భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అయితే ఒకరి సినిమాలో మరొకరు కనిపిస్తూ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఈ హీరోలు. అయితే ఇప్పుడు షారుఖ్ , సల్మాన్ కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది .  ఈ యాక్షన్ హీరోలు కలిసి  ‘ టైగర్ వర్సెస్ పఠాన్’లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ‘డంకీ’ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతుంది. అటు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాతో బిజీగా ఉన్నాడు. జెట్ స్పీడ్ లో ఈ మూవీని కంప్లీట్ చేస్తున్నాడు మన కండల వీరుడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇద్దరూ ‘టైగర్ వర్సెస్ పఠాన్’ పనుల్లో బిజీ కానున్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే సినిమా యూనివర్స్‌ని కూడా సిద్ధం చేసిందని తెలుస్తోంది.  ‘టైగర్’ మూవీ సిరీస్‌లో సల్మాన్ ఖాన్ పోషించిన ‘టైగర్’ పాత్ర అలాగే ‘పఠాన్’ సినిమాలో షారుక్ ఖాన్ చేసిన రా ఏజెంట్ పాత్ర కలిపి ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నారట. దర్శకుడు ఆదిత్య చోప్రా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లను విడివిడిగా కలుసుకుని సినిమా కథను వివరించాడు. ఇద్దరికీ కథ నచ్చి స్క్రిప్ట్‌ను ఖరారు చేశారట. మార్చి 2024 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. 2025 ప్రారంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. షారూఖ్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా అదే రేంజ్ లో కలెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే ఆ  సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో అంటూ అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.