మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేశారు రవితేజ. శ్రీలీల హీరోయిన్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు రవితేజ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా రావణాసుర అనే సినిమాతో రాబోతున్నాడు మాస్ రాజా. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . అలాగే ఈ సినిమా తర్వాత టైగర్ నాగేశ్వరావు అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు రవితేజ ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దర్శకుడు ఇద్దరు హీరోలకు కథ చెప్పాడట. ఇద్దరికీ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.
శర్వానంద్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు. ఈ మధ్యలో చేసిన ఒకేఒక జీవితం సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికి సాలిడ్ హిట్ అవ్వలేకపోయింది. దాంతో శర్వానంద్ ఇప్పుడు రవితేజతో కలిసి చేసే సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రేజీ కాంబోలో సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Sharwanand