
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతే కాదు రీసెంట్ డేస్ లో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అఖండ సినిమాతో మొదలు పెట్టి వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంటున్నారు బాలయ్య. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో బాలయ్య, గోపిచంద్ కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా తర్వాత వస్తున్న సినిమాకావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.
కాగా బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, కొరటాల శివ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ హీరో నటిస్తున్నారని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్. ఒకప్పుడు హీరోగా రాజశేఖర్ ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. మొన్నామధ్య నితిన్ నటించిన సినిమాలో కనిపించారు. అలాగే రీసెంట్ గా బైకర్ సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించి మెప్పించారు రాజశేఖర్.
ఇక ఇప్పుడు రాజశేఖర్, విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు బాలయ్య , కొరటాల సినిమాలోనూ రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ రాజశేఖర్ ను సంప్రదించారని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. కాగా ఈ సినిమా సామాజిక సందేశంతోపాటు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా 112వ సినిమా.. త్వరలోనే రాజశేఖర్ పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి