Yash: కేజీఎఫ్ యశ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యినట్టేనా.. డైరెక్టర్ ఎవరంటే

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్నిన్ అందుకుంది. అలాగే ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కేజీఏఫ్ సినిమా రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ విషయంలో బాహుబలి సినిమాతో పోటీపడింది ఈ సినిమా. నాన్ బాహుబలి కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక యశ్ టాలీవుడ్ లోనూ చాల ఫెమ్స్ అయ్యాడు. అతడి సినిమాలకోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Yash: కేజీఎఫ్ యశ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యినట్టేనా.. డైరెక్టర్ ఎవరంటే
Yash

Updated on: Sep 13, 2023 | 8:45 AM

కేజీఎఫ్  సినిమాతో ఒక్కసారిగా ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్నిన్ అందుకుంది. అలాగే ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కేజీఏఫ్ సినిమా రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ విషయంలో బాహుబలి సినిమాతో పోటీపడింది ఈ సినిమా. నాన్ బాహుబలి కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక యశ్ టాలీవుడ్ లోనూ చాల ఫెమ్స్ అయ్యాడు. అతడి సినిమాలకోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

కేజీఎఫ్ 2తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు యశ్. ఆయన సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు ఓ లేడీ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. కన్నడ హీరో అయిన యశ్ ఇప్పుడు మలయాళ దర్శకురాలి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ డైరెక్షన్ లో యశ్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. గీతూ మోహన్‌ గతంలో ‘లయర్స్‌ డైస్‌’, ‘మూతన్‌ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక ఇప్పుడు యశ్ తో ఆమె సినిమా చేస్తున్నట్టు కేవీఎన్‌ ప్రొడక్షన్‌ సంస్థ తెలిపింది.

త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? విలన్ ఎవరు.? అన్నది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలావుంటుంది అన్నది చూడాలి.

హీరో యశ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.