నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అఖండ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. ఆ తర్వాత రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ అందుకున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా భారీ విజయం అందుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తోంది. ఈ మూవీలో శ్రీలీల బాలకృష్ణ కూతురిగా నటిస్తుందని టాక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. బాలకృష్ణ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజల్ టీచర్ పాత్రలో కనిపించనుందట. అలాగే బాలకృష్ణ 50 ఏళ్ల వయసున్న పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో అనిల్ మార్క్ లో కామెడీ ఉంటుందని తెలుస్తోంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.