
కెరీర్‌లో బిగ్ చేంజ్‌కు రెడీ అయిన మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఆ డెసిషన్‌ను టెంపరరీగా వాయిదా వేశారు. నటుడిగా ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో రిస్క్ తీసుకోవటం ఎందుకనుకుంటున్నారు దుల్కర్. ఇంతకీ దుల్కర్ తీసుకోవాలనుకున్న ఆ రిస్క్ ఏంటి..? అనుకుంటున్నరారా అయితే వాచ్ దిస్ స్టోరి. మల్టీ లింగ్యువల్ స్టార్‌గా దూసుకుపోతున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.
మాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్… తరువాత తెలుగు, హిందీ భాషల్లోనూ హీరోగా మంచి విజయాలు సాధించారు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జెమని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. ఆతర్వాత ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Get ready to groove to the energetic and foot-tapping beats of #Kalapakkaara from #KingOfKotha. We had an absolute blast dancing to this song.
Malayalam- https://t.co/YrMLcJf46r
Telugu- https://t.co/qHTpUXCv4c
Tamil- https://t.co/7aBY0l7w5q
Hindi- https://t.co/tMBK7av5YS… pic.twitter.com/KjH83ThNqC— Dulquer Salmaan (@dulQuer) July 28, 2023
సీతారామం సినిమాతో మరోసారి తన నటనతో కట్టిపడేసాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ సాధించి.. నేషనల్ లెవల్‌లో ఫుల్ బిజీ అయ్యారు. ప్రజెంట్ హీరోగా బిజీగా ఉన్న దుల్కర్. నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇంట్రస్టింగ్ ఐడియాస్‌తో రూపొందుతున్న సినిమాలను మాత్రమే తన బ్యానర్‌లో ప్రొడ్యూసర్ చేస్తున్నారు దుల్కర్. ఆల్రెడీ యాక్టింగ్, ప్రొడక్షన్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ క్యూట్ హీరో.. మెగాఫోన్ పట్టుకోవాలని ఆశపడ్డారు. చుప్ సినిమాలో ఫెయిల్యూర్ దర్శకుడిగా నటించిన దుల్కర్, రియల్ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలనుందని చెప్పారు. అప్పట్లో దర్శకుడిగా మారబోతున్నా అని హింట్ ఇచ్చినా.. ప్రస్తుతానికి ఆ డెసిషన్ వాయిదా వేశారు ఈ ఛార్మింగ్ స్టార్. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దుల్కర్ లైనప్ చూస్తే ఇప్పట్లో అది అయ్యే పని కాదంటున్నారు మాలీవుడ్ మేకర్స్. ఏది ఏమైనా దుల్కర్ డైరెక్టర్ గా మారితే ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.