
టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ చాలా కాలంగా సలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. హిట్లు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గౌతమ్ నంద సినిమా తర్వాత గోపీచంద్ హిట్ అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు గోపీచంద్ నెక్ట్స్ సినిమా పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే గోపీచంద్ హీరోగా క్రేజ్ తెచుకోక ముందే విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
జయం, నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ తన విలనిజంతో అదరగొట్టారు. ముఖ్యంగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే వర్షం సినిమాలోనూ తన నటనతో మెప్పించాడు. ఆతర్వాత హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు .
ఇక ఇప్పుడు మరోసారి గోపీచంద్ విలన్ గా మెప్పించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో గోపి మాట్లాడుతూ.. విలన్ రోల్స్ లో నటిస్తారా అని ప్రశ్నిస్తే.. మంచి కథ దొరికితే చేస్తా అని తెలిపారు. దాంతో ఇప్పుడు గోపి చాంద్ విలన్ గా నటించేందుకు సిద్ధమయ్యారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.