సెలబ్రెటీల విషయంలో నెటిజన్స్ చాలా అలర్ట్ గా ఉంటారు. సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయానైనా క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించింది అనుష్క శర్మ. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకొని ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేసింది అనుష్క. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది. నటి అనుష్క శర్మ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఆమె పేరు వైరల్ అవుతోంది. అయితే ఈసారి ఆమె సినిమాల గురించి కాదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఆమె పై చర్చ జరుగుతోంది. అనుష్క శర్మ తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది.
అనుష్క శర్మ తొలిసారిగా గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో ఫోటోను పోస్ట్ చేసింది. మొబైల్ వన్ ప్రమోషన్ కోసం అనుష్క శర్మ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు ‘సమయం చాలా వేగంగా పరిగెడుతోంది’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటో చూసిన వెంటనే అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఫొటోలో ఆమె గర్భం ఎత్తుగా కనిపించడమతొ ఆమె ప్రగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి పెళ్లయి కొన్నేళ్లైంది. ఈ దంపతులకు వామిక అనే కుమార్తె ఉంది. ఇప్పుడు అనుష్క శర్మ తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అనుష్క పబ్లిక్‌గా కనిపించకపోవడమే ఇందుకు కారణం. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు అనుష్క శర్మ వచ్చింది. ఈ సమయంలో అందరి దృష్టి ఆమె పై పడింది. పెళ్లయిన నటీమణులు పబ్లిక్‌గా కనిపించినప్పుడు గర్భాన్ని దుపట్టాతో కప్పుకుంటే, ప్రెగ్నెన్సీ గాసిప్‌లు వస్తుంటాయి. ఇప్పుడు అనుష్క కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటోంది. త్వరలోనే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. 2018లో ‘జీరో’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.