Anil Ravipudi: బాలయ్య తర్వాత అనిల్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరులో అనిల్(Anil Ravipudi) పేరుకూడా ఉంటుంది. నిన్నమొన్నటి వరకు మీడియాల్ హీరోలతో సినిమాలు చేస్తూ..

Anil Ravipudi: బాలయ్య తర్వాత అనిల్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?
Anil Ravipudi

Updated on: Apr 02, 2022 | 5:25 PM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరులో అనిల్(Anil Ravipudi) పేరుకూడా ఉంటుంది. నిన్నమొన్నటి వరకు మీడియాల్ హీరోలతో సినిమాలు చేస్తూ.. హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడు అనిల్. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య. ఇప్పుడు గగోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ తో సినిమా చేయనున్నారు బాలయ్య. తనదైన స్టైల్ లో బాలయ్య కోసం సినిమాను రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం బాలయ్య కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు అనిల్.

ఇదిలా ఉంటే అనిల్ తర్వాత మరో స్టార్ హీరో తో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి బాలయ్య సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత వెంటనే బాలయ్య సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఆ తరువాత తారక్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందట. అటు తారక్ కూడా రెండు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరొకటి చేస్తున్నాడు తారక్. ఈ రెండు సినిమాలతర్వాత అనిల్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..

Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..

Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు