
అనిల్ రావిపూడి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా దింపుతున్నాడు. వచ్చిన ప్రతిసారి విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్న అనిల్ రావిపూడి ఇటీవల చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. ఈ సినిమా విజయంతో అనిల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే కలెక్షన్స్ కుమ్మేస్తుంది. రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా దూసుకుపోతుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇక మన శంకర వరప్రసాద్ సినిమా తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెంకటేష్ తో అనిల్ మరోసారి సినిమా చేస్తున్నారని అంటున్నారు. అలాగే అనిల్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో సినిమా చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
దాంతో అనిల్ క్రేజీ హీరోలను లైనప్ చేసి ఈసారి అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదెక్కడి కాంబోరా దేవుడా..! అంటూ నెటిజన్స్ అనిల్ నెక్స్ట్ సినిమా పై పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ.. నెట్టింట మాత్రం అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాతో వస్తాను అని అనిల్ ఇప్పటికే చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..