
ప్రస్తుతం పూరిజగన్నాథ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పూరి. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు టబుతో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో మరో స్టార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అతను ఎవరో కాదు ఆకాష్ పూరి ( ఆకాష్ జగన్నాథ్ ). చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత హీరోగా మారాడు. కానీ ఆకాష్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు . ఇప్పుడు తన తండ్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు పూరి తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి యంగ్ ఏజ్ క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేసే అవకాశముందని తెలిసింది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.