AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ… రవితేజ నెక్స్ట్ సినిమాలో ఈ అందాల భామ.?

రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు రావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ... రవితేజ నెక్స్ట్ సినిమాలో ఈ అందాల భామ.?
Raviteja
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 2:33 PM

Share

మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో  రవితేజ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు కావడంతో ఆడియన్స్ తెగ ఆసక్తిగా థియేటర్స్ కు వెళ్తున్నారు. ఇప్పటికే రూ. 135కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధించడం ఖాయం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రవితేజ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రానికి ఓకే చెప్పాడు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

ఈ సినిమాకు దాగుడు మూతల దండాకోర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేసింది.

ఇవి కూడా చదవండి

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఐశ్వర్య. అచ్చ తెలుగమ్మాయికి.. వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఆమెకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ జనాలకు దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ.  ఇక ఇప్పుడు రవితేజ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఐశ్వర్య రాజేష్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us