AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi : సెకండ్ సండే ఇరుముడి సంచలనం.. బుక్ మై షోలో గంటకు 20వేలకు పైగా టికెట్స్..

గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా ఇరుముడి. మంచి హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రెండో వారం ముగింపులోనూ ఈ మూవీ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ ఆదివారం బుక్ మై షోలో గంట వ్యవధిలోనే 20వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Irumudi : సెకండ్ సండే ఇరుముడి సంచలనం.. బుక్ మై షోలో గంటకు 20వేలకు పైగా టికెట్స్..
Irumudi
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 11:17 AM

Share

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ కాకపోయినా బలమైన కథనంతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. మంచి హైప్ మధ్య విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుదలై రెండు వారాలైనప్పటికీ ఏమాత్రం జోరు తగ్గడం లేదు. రోజు రోజుకీ ఫ్యామిలీ అడియన్స్, యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా బుక్ మై షోలో ఈ చిత్రం జోరు చూసి సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

గంటకు ఏకంగా 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశాయి. సాధారణంగా ఎంత భారీ బడ్జెట్ చిత్రానికైనా రెండో వారంలోనే కలెక్షన్ల వేగం తగ్గుతుంది. కానీ ఇరుముడి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికీ ఈసినిమా డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ తొమ్మిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూల్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు సైతం హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

అతి త్వరలోనే ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. ఇందులో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. బేబీ నక్షత్ర కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Follow Us