ఇప్పటికే మూడు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసారి పండక్కి మరో మాస్ విలేజ్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. అదే నా సామిరంగ. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత ఈ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చిన నాగ్.. మరోసారి తన మాస్ యాక్టింగ్తో అలరించాడు. ఈసారి పండక్కి ఫ్యామిలీ అడియన్స్ కోసం విలేజ్ మాస్ ఫ్యామిలీ మూవీని అందించాడు నాగ్. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. నా సామిరంగ సినిమాతోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు విజయ్ బిన్ని.
ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబరులో మొదలైన ఈ సినిమా కేవలం నాలుగు నెలల్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి పండగ సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో నాగ్, అల్లరి నరేష్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ హక్కులను సదరు ఛానల్ స్టార్ మా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారట. వచ్చే నెల చివర్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
𝗦𝗮𝗻𝗸𝗿𝗮𝗻𝘁𝗵𝗶 𝗞𝗜𝗡𝗚 🔥
With overwhelming positive response & reviews, our Kishtayya @iamnagarjuna once again reigns 👑
Book Your Tickets Now for the Special Family Feast #NaaSaamiRanga ❤️
🎟 https://t.co/V04Lzh6F0j#NaaSaamiRangaJaathara
KING👑 @iamnagarjuna… pic.twitter.com/aFSFgXeNOS
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.