Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ బాహుబలి ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది

టాలీవుడ్ నటుడు, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హీరోలు రామ్ చరణ్, చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి.

Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ బాహుబలి ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Ram Charan

Updated on: May 14, 2025 | 4:32 PM

సినిమా రంగంలో సాధించిన ఘనతలకు ప్రతీకగా రామ్ చరణ్ కు ఇటీవలే అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక లండన్ మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో రామ్ చరణ్, చిరంజీవి, ఉపాసన, సురేఖ, క్లింకార తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. అయితే ఇదే కార్యక్రమంలో రామ్ చరణ్ తో కనిపించిన ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారీ కాయంతో ఉన్న అతని ఫొటోలు కూడా నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అతని పేరు జూలియస్‌ ఫ్రాన్సిస్‌. విగ్రహావిష్కరణ అనంతరం రామ్ చరణ్ తన ఫ్యాన్స్ ను కలిసేందుకు మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా నియమించిన బౌన్సర్ల బృందంలో జూలియస్‌ ఫ్రాన్సిస్‌ కూడా కనిపించాడు. ఫ్రాన్సిస్‌ తన బాక్సింగ్‌ బెల్టును తీసుకుని రామ్‌ చరణ్‌ దగ్గరికి తీసుకు వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ప్రస్తుతం బౌన్సర్ గా ఉంటోన్న జూలియస్ ఫ్రాన్సిస్‌ ఒకప్పుడు హెవీ వెయిట్ ప్రొఫెషనల్ బాక్సర్. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తో కూడా తలపడ్డాడు. ప్రతిష్ఠాత్మక బ్రిటిష్‌ హెవీవెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ ను ఏకంగా ఐదు సార్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు నాలుగుసార్లు కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు.

 

ఇవి కూడా చదవండి

అరవై ఏళ్ల జూలియస్‌ ఓవరాల్‌గా తన బాక్సింగ్ కెరీర్‌లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు. ఇక 2007లో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ బౌట్‌లోనూ జూలియస్‌ ఫ్రాన్సిస్‌ పాల్గొన్నాడు. ఆ తర్వాత 2012లో యాక్టింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు. 2022లో యూకేలో ఓ రెస్టారెంట్‌ బయట ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరిగింది. అప్పుడు అక్కడే బౌన్సర్‌గా ఉన్న ఫ్రాన్సిస్‌ సదరు ఫ్యాన్స్‌ను నెట్టివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఫ్రాన్సిస్ పేరు బాగా మార్మోగిపోయింది. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వార్తల్లో నిలిచాడు.

రామ్ చరణ్ తో జూలియస్‌

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .