Toxic Movie: ఎవరీ గీతూ మోహన్ దాస్‌? ‘టాక్సిక్’ టీజర్‌తో సెన్సేషన్ అయిన ఈ లేడీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

రాకింగ్ స్టార్ యష్‌ 'టాక్సిక్' సినిమా టీజర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. హాలీవుడ్ లెవెల్ లో ఉన్న ఈ టీజర్ లో అదే రేంజ్ లోనే బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. దీనిని చూసి యశ్ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు

Toxic Movie: ఎవరీ గీతూ మోహన్ దాస్‌? టాక్సిక్ టీజర్‌తో సెన్సేషన్ అయిన ఈ లేడీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Toxic Movie Director Geetu Mohandas

Updated on: Jan 09, 2026 | 9:59 AM

ట్యాక్సిక్ సినిమాకు ముందు గీతూ మోహన్ దాస్ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఎప్పుడైతే యశ్ తో సినిమాను ప్రకటించారో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. అయితే టాక్సిక్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఇప్పటివరకు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయని గీతూ మోహన్ దాస్ యశ్ లాంటి పాన్ ఇండియా హీరోను ఎలా హ్యాండిల్ చేస్తుంది? అని అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే గురువారం (జనవరి 08) రిలీజైన టాక్సిక్ టీజర్ తో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఒక లేడీ డైరెక్టరేనా ఈ మూవీ తీసింది అంటూ రామ్ గోపాల్ వర్మ సైతం గీతూ మోహన్ దాస్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి. ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. వీరిది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మొదట బాల నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. ‘ఒన్ను ముట్టల్ పూజ్యం వరే’ బాలనటిగా గీతూ మోహన్ దాస్ మొదటి సినిమా. ఈ చిత్రానికి మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తళుక్కుమని మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి గీతూ వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. కాగా కథానాయికగానూ గీతూ మోహన్ దాస్ ప్రయాణం కూడా మోహన్ లాల్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతోనే. ఇందులో ఇద్దరు హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. దీని తర్వాత పలు సినిమాలు చేసిందామె. అయితే ‘Akale’లో గీతూ మోహన్ దాస్ నటనకు మంచి పేరు రావడమే కాదు… కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది.

ఇవి కూడా చదవండి

భర్తతో గీతూ మోహన్ దాస్..

దర్శకురాలిగా ప్రయాణం..

గీతూ మోహన్ దాస్ ప్రయాణం హిందీ సినిమా ‘లయర్స్‌ డైస్’ తో మొదలైంది. అంతుకు ముందు ఆమె షార్ట్ ఫిల్మ్ తీసింది. ‘లయర్స్‌ డైస్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా గీతాంజలి థాపా, ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. దీని తర్వాత ప్రేమమ్ హీరో నివీన్ పౌలీతో కలిసి మూథోన్ సినిమా చేసిందీ లేడీ డైరెక్టర్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాకింగ్ స్టార్ యశ్ తో ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ మూవీని తెరకెక్కిస్తోంది గీతూ మోహన్ దాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.