Coolie Movie: అందమైన హీరోయిన్‌ను విలన్ చేసేశారేంటి? కూలీ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా గురువారం (ఆగస్టు 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. అయితే లేడీ విలన్ రోల్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Coolie Movie: అందమైన హీరోయిన్‌ను విలన్ చేసేశారేంటి? కూలీ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
Coolie Movie Actress

Updated on: Aug 15, 2025 | 4:13 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. అపజయమెరుగని దర్శకుడిగా పేరున్న లోకేశ్ కనగరాజ్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. రజనీతో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్.. ఇలా స్టార్ నటీనటులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. అలాగే పూజా హెగ్డే కూడా మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. కూలీ సినిమాలో విలన్ గా నాగార్జున నటించారు. అయితే ఇదే మూవీలో ఒక లేడీ విలన్ కూడా ఉంది. డబ్బు కోసం సైమన్ కుమారుడిని వలలో వేసుకునే మహిళగా ఆమె అద్భుతంగా నటించింది. కూలీ సినిమాలో ఈ అమ్మడి నటనకు థియేటర్లలో క్లాప్స్ కూడా కొడుతున్నారు. ఆవిడ క్యారెక్టర్, ఇచ్చే ట్విస్టులను చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? తెలుగు సినిమాలనూ హీరోయిన్ గా నటించింది. అయితే మూవీ హిట్ కాలేదు. దీంతో తెలుగులో ఒక్క సినిమాకే పరిమితమైంది. కానీ కన్నడలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ ముద్దుగుమ్మ పేరు రచితా రామ్.

కళ్యాణ్ దేవ్ గుర్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడిగా ఉన్న రోజుల్లో అతను కొన్ని సినిమాలు చేశారు. అందులో ‘సూపర్ మచ్చి’ కూడా ఒకటి. ఇందులో రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా ఇదే. అయితే కన్నడలో మాత్రం రచిత పాపులర్ హీరోయిన్. పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర, సుదీప్, ధ్రువ్ సర్జా, దర్శన్, శివరాజ్ కుమార్, దర్శన్ తదితర హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కన్నడ ఆడియెన్స్ ఈ బ్యూటీని ముద్దుగా డింపుల్ క్వీన్ అని పిల్చుకుంటారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నకన్నడ హీరోయిన్ కూడా రచితానే. ప్రస్తుతం ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. రచితకు నిత్యా రామ్ అనే సిస్టర్ కూడా ఉంది. ఆమె కన్నడ సీరియల్స్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

చీరలో రచితా రామ్..

ఇక కూలీ సినిమా విషయానికి వస్తే… సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. మొదటి రోజే ఈ సినిమాకు రూ. 151 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.