
సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా ఇప్పుడు రివర్స్ లో థియేటర్లలో విడుదలవుతోంది. అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా. ఇటీవలే నేరుగా ఈటీవీ విన్ లో విడుదలైన ఈ మూవీ అందరి మన్ననలు అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పిల్లల చదువు, పెంపకం, తల్లి దండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారని అనగనగా సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సన్నీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో వ్యాస్ పాత్రలో సుమంత్ మరోసారి అదరగొట్టాడు. ఇక అతని భార్య, స్కూల్ ప్రిన్సిపాల్ పాత్రలో కాజల్ చౌదరి కూడా ఎంతో అందంగా కనిపించింది. ఇది ఆమెకు మొదటి సినిమా. అయినా ఓ పిల్లాడికి తల్లిగా ఎంతో అద్భుతంగా నటించింది. అనగనగా సక్సెస్ నేపథ్యంలో కాజల్ చౌదరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
బీహార్‌లోని పాటలీపత్రకు చెందిన కాజల్ చౌదరి కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది. అయితే చదువుకుంటోన్న సమయంలోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు అందాల పోటీల్లోనూ సత్తా చాటింది. ఇదే క్రమంలో మిస్ యూనివర్స్ బీహార్‌గా (2024) కూడా ఎంపికైంది కాజల్.
ఉన్నత చదువులు అభ్యసించిన ఈ ముద్దుగుమ్మ పైలట్ కావాలని కలలు కంది. కానీ అనుకోకుండా వెండితెరకు పరిచయమైంది. మొదట ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక అనగనగా సినిమాతో తెలుగు తెరకు కూడ పరిచయమైంది. ఇందులో సుమంత్ భార్యగా, ఓ పిల్లాడికి తల్లిగా అలాగే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ గా కాజల్ అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఈ సినిమా విజయంతో మరో రెండు చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుందీ అందాల తార. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న కరాలి మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది కాజల్ చౌదరి. అలాగే మరో మూవీలోనూ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .