Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా

నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా

Phani CH

|

Updated on: May 26, 2025 | 3:04 PM

స్నిగ్ద.. చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. స్నిగ్ద అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చుస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ద. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాం లో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ద ను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా ‘అలా మొదలైంది’ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. స్నిగ్ద కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ద.చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లి కి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ద. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆమె టామ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా చేస్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక ఓ రీజన్ కూడా ఉంది. స్నిగ్ద పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది. ప్రతి ఏడాది శివమాల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. తనకు ఎప్పుడూ ఎదురైన అమ్మాయా? అబ్బాయా.? ప్రశ్న గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈమె. తాను అమ్మయినే.. అబ్బాయిని కాదంటూ చెప్పింది. అంతేకాదు తనకు నాకు ప్రతినెలా పీరియడ్స్ వస్తాయని ప్యాడ్స్‌ కూడా కొంటానంటూ ఓపెన్‌గా చెప్పేసింది. కానీ తనకు అబ్బాయిలా కనిపించడమే ఇష్టమంటూ చెప్పింది. షర్ట్, ప్యాంట్ వేసుకుంటే తనకు కంఫర్ట్ గా ఉంటుందని కుండబద్దలు కొట్టేసింది.దాంతో పాటే 43 ఏళ్లు వచ్చినా తనకు పెళ్లి మీద ఆలోచన రాలేదంటూ చెప్పింది. తాను పెళ్లి చేసుకోనని.. చేసుకుంటే.. మరొకరి కంట్రోల్ లోకి వెళ్ళిపోతామని అందుకే పెళ్లికి తాను నో అంటూ చెప్పుకొచ్చింది ఈమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే.. పవన్‌ ఏం అయ్యేవారో తెలుసా?

నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్‌ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ..

తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్.. గూగుల్‌ మ్యాప్‌ సాయంతో.. 38 ఏళ్ల ఏజ్​లో పేరెంట్స్ చెంతకు..