Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌

Phani CH

|

Updated on: May 26, 2025 | 3:17 PM

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3: ది థర్డ్‌ కేస్‌. గతంలో వచ్చిన హిట్ సిరీసుల్లో ఇది మూడో సినిమా. మొదటి రెండు పార్ట్ లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్-3ని సినిమాను తెరకెక్కించాడు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య మే 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హిట్-3 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో హిట్-3 మూవీ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లోనూ నాని సినిమాకు మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడనుంది. హిట్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. హిట్ 3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హిట్ 3 సినిమాను మే 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్‌లో హిట్ 3 మూవీని పెట్టేసింది. అయితే నెట్ ఫ్లిక్స్, హిట్ 3 టీం దీనిపై అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది. నాని హిట్3 సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు తెలుస్తోంది. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. నాని, శ్రీనిధి శెట్టిలతో పాటు సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అడవిశేష్, కార్తీ క్యామియో రోల్స్ లో కనిపించారు. ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ స్వరాలు సమకూర్చాడు. మరి థియేటర్లలో హిట్ 3 సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ నాని సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మరో 4 రోజులు వెయిట్ చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా

సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే.. పవన్‌ ఏం అయ్యేవారో తెలుసా?

నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్‌ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ..

తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్.. గూగుల్‌ మ్యాప్‌ సాయంతో.. 38 ఏళ్ల ఏజ్​లో పేరెంట్స్ చెంతకు..