Tollywood: హైదరాబాదీ.. మార్వాడి ఫ్యామిలీ అమ్మాయి… ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు గుడి కూడా కట్టేశారు.. ఎవరో తెలుసా?

ఈ టాలీవుడ్ హీరోయిన్ పేరు ప్రస్తుతం తెగ మార్మోగిపోతోంది. ఎందుకంటే ఈ అమ్మడు కథానాయికగా నటించిన ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగు తుందని ఈ అందాల భారీ గానే ఆశలు పెట్టుకుంది.

Tollywood: హైదరాబాదీ.. మార్వాడి ఫ్యామిలీ అమ్మాయి... ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు గుడి కూడా కట్టేశారు.. ఎవరో తెలుసా?
Tollywood Actress

Updated on: May 28, 2025 | 1:48 PM

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పుడు దక్షిణాదిలోనే స్థిరపడిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది. తెలుగులో ఈ అమ్మడికి ఇప్పుడే బోలెడంత క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడది నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే ఛాన్సుంది. దీనికి కారణం ఆమె చేస్తున్న సినిమాలే. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టుల్లో కథానాయికగా నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇందులో ఒక మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడీ హీరోయిన్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. తను మరెవరో కాదు హరి హర వీర మల్లు హీరోయిన్ నిధి అగర్వాల్. సినిమా రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో ఈ హీరోయిన్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిధి అగర్వాల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మిస్టర్ మజ్ఞు సినిమాలోనూ నటించింది. అయితే రామ్ తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మొదటి సూపర్ హిట్ అందుకుంది. తమిళంలోనూ శింబు, రవి మోహన్ (జయం రవి) తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ అమ్మడికి సరైన హిట్ దక్కలేదు.

ఇవి కూడా చదవండి

హరి హర వీరమల్లులో పంచమిగా నిధి అగర్వాల్..

ఇప్పుడు నిధి అగర్వాల్ఆశలన్నీ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు, ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలపైనే ఉన్నాయి. ఇందులో పవన్ సినిమా జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా నిధి అందానిక ముగ్ధులైన అభిమానులు చెన్నైలో ఆమెకు ఏకంగా గుడి కట్టేసి పూజలు చేస్తున్నారు.

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .