అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆమె తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా
Inaya Sultana

Updated on: Dec 30, 2025 | 10:32 AM

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సినిమాలతోనూ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది వరుసగా సినిమాలు చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాపై తన అభిప్రాయాలను పంచుకుంది. సెలబ్రిటీలు ఎదుర్కొనే మీడియా ఒత్తిడి గురించి కూడా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులు చేసిన పని లేదా మాట్లాడిన మాట అంతగా వైరల్ అవ్వదు.., కానీ సెలబ్రిటీలు మాట్లాడితే మాత్రం మీడియా దాన్ని పెద్దది చేస్తుందని చెప్పుకొచ్చింది ఇనయ. ఇది పీఆర్ గేమ్స్‌లో భాగం కావచ్చని, సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఇలా జరుగుతుందని ఆమె అన్నారు. శివాజీ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి ప్రస్తావించినప్పుడు, సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు చేసే వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, వాటి ప్రభావం సమాజంపై ఉంటుందని తెలిపింది ఇనయ.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోల గురించి మాట్లాడుతూ.. తన జిమ్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. తాను ఎక్కువగా డిప్రెషన్‌లో ఉన్నానని, దాన్ని అధిగమించడానికి కొత్త విషయాలను అన్వేషించాలని అనుకుంటున్నానని, జిమ్ తన జీవితంలో ఒకే ఒక సంతోషాన్నిచ్చే పని అని ఆమె చెప్పారు. డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చని, కానీ శరీరాన్ని కొనలేమని, మార్చలేమని ఆమె అన్నారు. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పదని, అందుకే తాను కేవలం జిమ్ ఫోటోలు మాత్రమే ఇన్ స్టాలో పెడతానని స్పష్టం చేశారు. ఇటీవల తాను త్రీ రోజెస్, బ్యాచిలర్, మల్లి భైరవం, శివం భజే, జాట్ వంటి పలు చిత్రాలలో నటించానని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.