
సుడిగాలి సుధీర్ సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యాంకర్‌గా, జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పుడు GOAT మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కన్నడ బ్యూటీ దివ్య భారతి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుధీర్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ కు ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆమె రిజెక్ట్ చేసిందని ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతుంది. అవును.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో డైరెక్టర్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఒకటి. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వీ కథానాయికగా సెలక్ట్ అయ్యింది. కానీ ఈ బ్యూటీని తన సినిమాలో కథానాయికగా తీసుకోవాలని ముందు సుధీర్ ట్రై చేశాడట.
ఇటీవల గెటప్ శ్రీను ఓ షోలో మాట్లాడుతూ.. ఇటీవల ప్రభాస్ సినిమాలో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు కదా. సుధీర్ తన గోట్ సినిమాలో ఆ అమ్మాయిని ముందే తీసుకుందాం అనుకున్నాడ. సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఆ అమ్మాయి కథానాయికగా అయితే బాగుంటుందని ఆమెను కంటాక్ట్ అయ్యారట. హీరోయిన్ గా ఆమెను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించారని.. కానీ కుదురలేదని.. కట్ చేస్తే ఆ అమ్మాయి ప్రభాస్ సినిమాలో చేస్తుందని సుధీర్ కు చెప్పగానే షాక్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.
సుడిగాలి సుధీర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చినప్పటికీ ఇమాన్వి రిజెక్ట్ చేసిందని.. కానీ ప్రభాస్ సినిమా మాత్రం ఓకే చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇమాన్వీ మొదట్లో సోషల్ మీడియాలో డాన్స్ రీల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. స్టైలీష్ డ్యాన్స్ మూమెంట్లతో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయిన ఇమాన్వీ.. ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.
#SudigaliSudheer Tried #FAUJI Actress #Imanvi in his Film #Goat but She Rejected it and accept #Prabhas Film 😳😳😳💥💥💥pic.twitter.com/Lf5WmsLUkA
— GetsCinema (@GetsCinema) November 11, 2024
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.