Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నిర్ణయానికి షాక్ అయిన పూరీ- ఛార్మీ.. ఇంతకు అందేంటంటే..

విజయ్ దేవరకొండ.. పూరీ..ఛార్మీకి సీరియస్‌గా ఓ విషయం చెప్పాడట. ఇక ఆ విషయం విన్న పూరీ - చార్మీ మనోడి వర్క్‌ డెడికేషన్‌కి ఫిదా అయిపోరట. ఇంతకీ ఆ విషయం ఏంటో అనుకుంటున్నారా..

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నిర్ణయానికి షాక్ అయిన పూరీ- ఛార్మీ.. ఇంతకు అందేంటంటే..

Edited By:

Updated on: Feb 24, 2021 | 10:09 PM

vijay devarakonda liger : విజయ్ దేవరకొండ.. పూరీ..ఛార్మీకి సీరియస్‌గా ఓ విషయం చెప్పాడట. ఇక ఆ విషయం విన్న పూరీ – ఛార్మి మనోడి వర్క్‌ డెడికేషన్‌కి ఫిదా అయిపోరట. ఇంతకీ ఆ విషయం ఏంటో అనుకుంటున్నారా.. అదేంటంటే రౌడీ విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమాను ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేద్దామని చెప్పాడట. అందుకోసం రాత్రి పగలు అనే తేడాలేకుండా తాను కష్ట పడతానన్నాడట.

అవసరమైతే హోటల్‌కు కూడా వెళ్లకుండా లైగర్‌ సెట్ లోనే నిద్రపోతా అని పూరీకి.. చార్మీకి చెప్పాడట. కరోనా ముందు స్టార్ట్‌ అయిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవడం.. ఇంకా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుండడంతో విజయ్‌ ఈ డెషిన్‌తీసుకుని లైగర్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌లకు చెప్పాడంట. ఇక ఈ మాట విన్న వారు… విజయ్‌ డెడికేషన్ చూసి.. షాకయ్యారంట.

ఇక లైగర్‌ షూట్‌లో ప్రజెంట్‌ విజయ్‌తోపాటు అనన్యా పాండే, రమ్యకృష్ణలు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్‌ దేవరకొండకు తల్లి పాత్రలో నటిస్తుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘లైగర్‌’ సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt : అలియా పై దర్శకధీరుడు ఫైర్.. డేట్స్ ఇవ్వడం లేదంటూ అలక.. జక్కన క్లారిటీ