Ileana D’Cruz: అతన్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను.. ఇలియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Mar 18, 2024 | 7:19 AM

తెలుగులో దాదాపు అందరూ హీరోల సరసన ఆడిపాడింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలోనూ ఇలియానా సత్తా చాటింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరం అయ్యింది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ పై ఫోకస్ చేసింది ఇలియానా.. కానీ అక్కడ అవకాశాలు అంతగా అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తినిప్రేమించడం.. బ్రేకప్ చెప్పుకోవడం జరిగిపోయాయి.

Ileana DCruz: అతన్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను.. ఇలియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ileana
Follow us on

ఇలియానా ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ఫెవరెట్ హీరోయిన్.. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పోకిరి, కిక్ లాంటి బిగెస్ట్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దాదాపు అందరూ హీరోల సరసన ఆడిపాడింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలోనూ ఇలియానా సత్తా చాటింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరం అయ్యింది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ పై ఫోకస్ చేసింది ఇలియానా.. కానీ అక్కడ అవకాశాలు అంతగా అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తినిప్రేమించడం.. బ్రేకప్ చెప్పుకోవడం జరిగిపోయాయి. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళిపోయింది ఇలియానా.

అదే సమయంలో బాగా బరువు పెరిగింది. తిరిగి సినిమాల్లో రాణించాలని ప్రయత్నించినా అది కుదరలేదు. రవితేజ సరసన ఆమె నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో మరోసారి ఇండస్ట్రీకి దూరం అయ్యింది ఈ గోవా బ్యూటీ. అయితే ఇటీవలే ఈ చిన్నది ఓ బిడ్డకు జన్మనించింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అందరికి షాక్ ఇచ్చింది.

చాలా రోజుల వరకు తన భర్త ఎవరో చెప్పలేదు ఈ చిన్నది. పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది ఈ వయ్యారి. ఇక సోషల్ మీడియాలో ఇలియానా చాలా యాక్టివ్ గా ఉంటుంది’. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకోకుండా తల్లయినప్పుడు చాలా మంచి తనను ట్రోల్ చేశారని తెలిపింది. తననే కాదు తన భర్త పై కూడా ట్రోల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. గర్భవతి అయినా కూడా సినిమాలు చేయాలని అనుకున్నా కానీ అదికుదరలేదు. బిడ్డ పుట్టినప్పుడు ఒత్తిడికి లోనయ్యా.. అప్పుడు నా భర్త నాకు చాల సపోర్ట్ చేశాడు. మా బంధం గురించి బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా గురించి ఎమన్నా నేను తట్టుకోగలను కానీ నా భర్త గురించి, నా కుటుంబం గురించి ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పుకొచ్చింది ఇలియానా.

ఇలియానా ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..