iBomma: ‘చేతనైతే పట్టుకోండి.. తగ్గేదేలే.! పోలీసులకు iBomma సవాల్’

రూల్స్‌ ఫాలో అయ్యేవాళ్లకి ఒకటేదారి. అడ్డదారులు వెతికేవారికి బోలెడన్ని దొంగదారులు. పైరసీ మాఫియా ఎలా జరుగుతోందో కళ్లకు కట్టారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌. సైబర్ క్రైమ్ పోలీసులు iBomma ముఠాను కట్టడి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తుంటే.. వాళ్లు చేసిన ఓ పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

iBomma: చేతనైతే పట్టుకోండి.. తగ్గేదేలే.! పోలీసులకు iBomma సవాల్
IBomma

Updated on: Oct 01, 2025 | 1:21 PM

మూవీ పైరసీ ముఠా ‘iBomma’పై ఇటీవల హైదరాబాద్ పోలీసులు కీలక ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. పైరసీ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఇకపై పైరసీలు జరగకుండా చూసుకుంటామని తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలకు హామీ ఇచ్చారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నేపధ్యంలో iBomma ముఠా సభ్యులు.. తాము చేసిన రెండు సంవత్సరాల ఓల్డ్ ట్వీట్‌ను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

ఇవి కూడా చదవండి

‘ఫస్ట్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే సైట్లపై దృష్టి పెట్టండి. మా సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది. తగ్గేది లేదు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అటు దేశవ్యాప్తంగా ibomma ఏజెంట్లు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు సినిమా పైరసీ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. iBomma కీలక నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. గతంలోనూ పోలీసులకు iBomma వెబ్‌సైట్ నిర్వాహకులు సవాల్ విసిరినా సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం దమ్ముంటే పట్టుకోవాలని పోలీసులకు, తెలుగు ఫిలిం చాంబర్‌కు iBomma సవాల్ విసిరింది. ఆ పోస్టునే మళ్లీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. iBomma సర్వర్‌లోనే Bappam వెబ్‌సైట్‌ను పైరసీ ముఠా నడుపుతోంది. తాజాగా అరెస్ట్ అయిన పైరసీ నిందితులు ఇచ్చిన సమాచారంతో iBomma నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వేట మొదలుపెట్టారు. నార్త్ స్టేట్స్‌లో ఉన్న పలువురు iBomma ఏజెంట్లను గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు