
ఒకే ఒక్కడు.. తెలుగు సినిమా ప్రపంచానికి తలనొప్పి తెప్పించాడు. కొన్ని వేల సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ చేశాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లను డౌన్ లోడ్ చేసి.. అడియన్స్ ఉచితంగా చూసేలా ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లను రూపొందించి రిలీజ్ చేశాడు. కొన్నాళ్లుగా అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైరసీని అడ్డుకోవాలంటూ చిత్రనిర్మాతలు, సినీప్రముఖులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాలు విసిరాడు రవి. ఇన్నాళ్లు ఎవరికి దొరక్కుండా ఉన్న రవిని.. చివరకు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు అతడి జీవితంపై సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇమ్మడి రవి కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా.. ఉచితం అనే పేరుతో పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
ఐబొమ్మ రవి.. సాధారణ వెబ్ డిజైనర్.. కానీ అతడి ఆలోచనలు.. సాంకేతిక నైపుణ్యం పోలీసులను, ఇటు జనాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇప్పుడు అతడి జీవితాన్ని సినిమాగా బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పుడు రవి జీవితంపై సినిమా తీయడానికి ముందుకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తారని సమాచారం. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతడు ఎదుర్కొన్న సవాళ్లను, ఐబొమ్మ వెబ్ సైట్ రూపొందించడానికి గల ఆలోచనలు ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
ఈ సినిమాలో రవిని హీరోగా చూపిస్తారా.. ? లేదా విలన్ గా చూపిస్తారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇమ్మడి రవి జీవితంపై సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు సోషల్ మీడియాలో అతడికి పాజిటివ్ పోస్టులు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..