Varma Vs Kodali Nani: ‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్

|

Jan 05, 2022 | 3:15 PM

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వార్ రోజురోజుకు ముదరుతోంది. టికెట్‌ రేట్ నుంచి ఎకనామిక్స్‌ దాకా వెళ్లింది పంచాయితీ.

Varma Vs Kodali Nani: నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు.. వర్మ టీజింగ్
Follow us on

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వార్ రోజురోజుకు ముదరుతోంది. టికెట్‌ రేట్ నుంచి ఎకనామిక్స్‌ దాకా వెళ్లింది పంచాయితీ. నిజానికి అమ్మేవాడికి ప్రతిఫలం ఉండాలి. కొనేవాడికి సంతృప్తి ఉండాలి. అమ్మేవాడు కొనేవాడు ఇద్దరూ లాభపడితే అది వ్యాపారం. ఒక్క అమ్మేవాడే ఆనందపడ్డాడూ అంటే అది లూటీ, దోపిడీ. సినిమా వాళ్లు చేస్తోంది అదే అన్నది సర్కారు వారి మాట. అమ్మేవాడు.. అమ్ముతాడు. కొనాలా వద్దా అన్నది కొనేవాడి ఇష్టం. ఇది వ్యాపారం అన్నది వర్మ మాటల్లో సారం. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ- మంత్రి పేర్ని నాని ట్వీట్ల పోట్లు చూస్తుంటే కనిపిస్తున్న విశ్లేషణ ఇదే.

మొత్తంగా ఆసాంతం సినిమానామిక్సే. అంటే సినిమా.. అందులో ఉన్న ఎకనామిక్స్‌. ప్రభుత్వం సినిమాను వినోదాన్ని పంచుతున్న సేవగా చూస్తోంది. అంటే సేవకు రుసుము నామమాత్రంగా ఉండాలనేది లెక్క. వర్మ ట్వీట్స్ చూస్తుంటే.. సినిమా పక్కా వ్యాపారమే. లాభాలే లెక్క.ఈ అంశంపై ప్రభుత్వం వేసిన కమిటీ తన పని తాను చేసుకుపోతూనే ఉంది. కానీ ఈ గ్యాప్‌లో ట్వీట్‌ వార్‌ పీక్‌కి వెళ్లిపోతోంది.

తాజాగా సీన్‌లోకి మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. రాంగోపాల్ వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో ఉండి ఏపీ గురించి రాంగోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్లని తాము అసలు పట్టించుకోమని పేర్కొన్నారు.

అయితే మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో తాను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని వర్మ పేర్కొన్నారు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో తెలియదని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

Also Read: పేర్ని నాని వర్సెస్ రామ్ గోపాల్ వర్మ.. వరుస ట్వీట్స్‌తో నెట్టింట్లో రచ్చ చేస్తున్న ఆర్జీవీ..