సమంత యశోద సినిమా మంచి హిట్ అయ్యింది. సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. సమంత నటనను సినీ అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీని వివిధ కారణాల వల్ల థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. కాగా యశోద సినిమా డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్సిమెంట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలో యశోద సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిత్ర ఓటీటీ విడుదలను డిసెంబర్ 19 వరకు విడుదల చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
యశోద సినిమాలో ఇవా హాస్పిటల్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతినెలా చూపించారని సదరు ఆస్పత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో తమ హాస్పిటల్ పేరు చూపించడం వలన తమ రెప్యుటేషన్ దెబ్బతింటుందని పేర్కొంది. చిత్ర ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు వారికి అందజేసింది. దీంతో యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19 కు వాయింది.
హరి, హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. మెడికల్ మాఫియా కాన్సెప్ట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సమంత యాక్షన్ సన్నివేశాలు చూసి ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు. తాను క్రౌడ్ పుల్లర్ అని సామ్ మరోసారి ప్రూవ్ చేసింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ ఈ మూవీలో కీ రోల్స్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..