Shyam Singha Roy : ‘కాళికాదేవి’ ఆలయం సెట్ లో నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్ షూటింగ్..

|

Apr 24, 2021 | 10:13 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే  నాని 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న'టక్ జగదీశ్' సినిమాను..

Shyam Singha Roy : కాళికాదేవి ఆలయం సెట్ లో నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్  షూటింగ్..
Follow us on

Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే  నాని ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న’టక్ జగదీశ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమాతో పాటు ‘శ్యామ్‌ సింగరాయ్’ కూడా కంప్లీట్  చేస్తున్నాడు. ‘టాక్సీవాలా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో సాయి పల్లవి, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ కూడా వేశారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే కోల్ కత నేపథ్యంలోని ‘కాళికాదేవి’ ఆలయం సెట్ ను వేశారు. కథ ప్రకారం 100 సంవత్సరాల క్రితం నాటి ఆలయంలా ఇది కనిపిస్తుందట. 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్ ను వేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కుల్లా తీర్చిద్దిద్దిన ఈ సెట్ లో చిత్ర్రీకరించే సీన్స్ అన్నీ కూడా కీలకమైనవేనట. నాని ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారని, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఈ సెట్ లో జరిగే ఉత్కంఠభరితమైన సన్నివేశంపైనే ఉంటుందని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..