War 2 Pre Release Event : ఎన్టీఆర్ మీకు అన్నా.. నాకు తమ్ముడు.. హృతిక్ రోషన్..

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ వార్ 2. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించగా.. మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

War 2 Pre Release Event : ఎన్టీఆర్ మీకు అన్నా.. నాకు తమ్ముడు.. హృతిక్ రోషన్..
Hrithik Roshan

Updated on: Aug 10, 2025 | 9:00 PM

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ వార్ 2. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించగా.. మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ..” తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనం అందరం ఒకే కుటుంబం. చాలా కాలం క్రితం క్రిష్ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. తెలుగు ప్రజల అభిమానం, ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. తారక్ నేను.. కోస్టార్స్ గా స్టార్ట్ చేశాము. కానీ చివరకు ఇద్దరం బ్రదర్స్ అయ్యాం. తారక్ రియల్ టైగర్. ఎన్టీఆర్ బెస్ట్ చెఫ్. మీరందరూ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. నేను కూడ మీకు ప్రామిస్ ఇస్తున్నాను. మీరందరూ నా తమ్ముడిని ఎప్పటికీ ఇలాగే ప్రేమించాలి. నా కెరీర్ లోనే వార్-2 టాప్ ప్లేస్ లో ఉంటుంది . నాకు ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఎవరూ మిస్ అవ్వొద్దు. యాక్షన్ సీన్లలో ఎన్నో గాయాలు అయ్యాయి. నేను గాయాలు అయితే వెంటనే కోలుకోలేను”.

“కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్. వెంటనే నేను ఓకే అంటాడు. ఎన్టీఆర్ ను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించేది. నేను సినిమా షూటింగ్ టైమ్ లో గాయాలు అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అనుకునే వాడిని. కానీ ఇప్పుడు మీ ప్రేమను చూస్తుంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది. తారక్ ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోంది. తారక్ కూడా నా లాగే కష్టపడుతాడు. ఒక్క టేక్ లోనే సీన్ కంప్లీట్ చేస్తాడు. అతను వన్ టేక్ యాక్టర్. నేను తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాట్ కు ఎలా వెళ్లాలో ఎన్టీఆర్ ను చూసి వందశాతం నేర్చుకున్నాను. అతను నటించిన షాట్ ను ఎవరూ నిర్ణయించక్కర్లేదు. అతను సీన్ కోసం వందశాతం ఎఫర్ట్ పెడుతాడు. నేను ఫ్యూచర్ లో చేసే సినిమాల్లో తారక్ లాగా ఎఫర్ట్ పెడతా. తారక్ యాక్టర్ మాత్రమే కాదు. అతను బెస్ట్ షెఫ్. తారక్ నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మనం తర్వాత సినిమాలు చేసినా చేయకపోయినా పర్లేదు. కానీ నువ్వు నాకు ఎప్పటికీ బిర్యానీ వండి పెట్టాలి ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?