Hrithik Roshan: ప్రియురాలితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న హృతిక్ రోషన్.. ఫోటో వైరల్

నటుడు హృతిక్ రోషన్ కూడా ప్రతి పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. హృతిక్ ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఆనందానికి తోడు అతని స్నేహితురాలు, ప్రియురాలు సబా ఆజాద్ కూడా ఇందులో భాగం అయ్యింది. అవును, సబా ఆజాద్ కూడా హృతిక్ రోషన్ కుటుంబంలో చేరారు . దీపావళి ఆనందంలో తన కుటుంబంతో కలిసి ఫోజులిచ్చింది.

Hrithik Roshan: ప్రియురాలితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న హృతిక్ రోషన్.. ఫోటో వైరల్
Hruthik Roshan

Updated on: Nov 14, 2023 | 10:04 AM

దీపావళి పండుగను దేశంమొత్తం ఘనంగా జరుపున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ పండుగను సంబరంగా జరుపుకున్నారు. నటుడు హృతిక్ రోషన్ కూడా ప్రతి పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. హృతిక్ ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఆనందానికి తోడు అతని స్నేహితురాలు, ప్రియురాలు సబా ఆజాద్ కూడా ఇందులో భాగం అయ్యింది. అవును, సబా ఆజాద్ కూడా హృతిక్ రోషన్ కుటుంబంలో చేరారు . దీపావళి ఆనందంలో తన కుటుంబంతో కలిసి ఫోజులిచ్చింది. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది.

హృతిక్ రోషన్ , సబా ఆజాద్ చాలా నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. త్వరలో వీరి పెళ్లి జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. హృతిక్ రోషన్ కుటుంబానికి సబా ఆజాద్ చాలా సన్నిహితురాలు. ప్రతి పండుగను వీరు కలిసి జరుపుకుంటారు. ఇప్పటికే హృతిక్ రోషన్, సబా ఆజాద్ కలిసి ఉన్న చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ దీపావళి పండుగకు హృతిక్ రోషన్ నలుపు రంగు కుర్తా ధరించాడు. నీలం , ఎరుపు రంగు లెహంగాలో సబా ఆజాద్ అబ్బురపరిచారు. వీరు దీపావళి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో హృతిక్‌కి సుసానే ఖాన్‌తో వివాహమైంది. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘టైగర్ 3’ సినిమాలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జనవరి 25, 2024న విడుదల కానుంది. అంతే కాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు హృతిక్.

హృతిక్ రోషన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..