మన టాలీవుడ్ లో ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆదరించాయి. ముఖ్యంగా అప్పట్లో సినిమాలు ఎంతో అర్ధవంతంగా.. మంచి కాన్సెప్ట్స్ తో తెరకెక్కేవి.. అలా వచ్చిన సినిమాల్లో సీతాకోక చిలక సినిమా ఒకటి. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు కూడా పాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఒకే సారి నిర్మించారు. తమిళ్ లో అలైగల్ ఓవతిల్లై అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. 1981లో వచ్చిన ఈ సినిమాలో కార్తీక్, ముచ్చెర్ల అరుణ హీరో హీరోయిన్స్ గా నటించారు. తమిళ్ లో ఆమె ప్లేస్ లో రాధా నటించారు. ఇక ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా హీరోయిన్ ముచ్చెర్ల అరుణ ఇప్పుడు ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ముచ్చర్ల అరుణ తెలంగాణ కొత్తగూడెం లో జన్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆమె నటించారు. తెలుగులో ఆమె 36 సినిమాలు, తమిళ్ లో 24, మలయాళంలో 14, కన్నడలో 3 సినిమాల్లో నటించారు అరుణ. కాగా ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. తాజాగా ముచ్చర్ల అరుణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో కుకింగ్ కు సంబంధించిన వీడియోలు చేస్తున్నారు. రకరకాల వంటలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.