దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు.. హనీరోజ్ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

హనీ రోజ్.. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ అందాల భామను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది ఈ బ్యూటీ. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు.

దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు.. హనీరోజ్ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..
Rachel Official Trailer

Updated on: Nov 17, 2025 | 1:08 PM

హనీరోజ్.. తెలుగులో ఈ  అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు నటన పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే హనీరోజ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. హనీ రోజ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజుల క్రితం ఈ సినిమా నుంచి హనిరోజ్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేశారు. ఇక  తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ ట్రైలర్ లో హనీరోజ్ చాలా డిఫరెంట్ గా కనిపించనుంది. గ్లామరస్ గా కనిపించడంతో పాటు కత్తి, గన్ పట్టుకొని యాక్షన్ సీన్స్ కూడా చేసింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో హనీరాజ్ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఇన్నాళ్లకు హనీ రోజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.