డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత డార్లింగ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈవేడుకలకు డైరెక్టర్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, ఈశ్వరీ.. టెక్నికల్ టీం, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో నీల్, పృథ్వీ, ప్రభాస్ నవ్వుతూ ఎంతో సరదాగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అలాగే ఇదే వేడుకలలో ‘హలో మేడమ్.. మమ్మీ.. బ్యూటీఫుల్ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్ ఆత్మీయంగా పలకరిస్తున్న వీడియో సైతం నెట్టింట వైరలవుతుంది. సలార్ హిట్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది చిత్రయూనిట్. బాహులి తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ఈ సినిమాపైనే అడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేశారు నీల్. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ హిట్ అందించాడు నీల్. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పాలి. రవి బస్రూర్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంది.
“After so many years, I am seeing #Prabhas Anna this happy.🥲🥲🥲”#Salaar #Kalki2898AD #PrashanthNeel #ShrutiHaasan #PrithvirajSukumaran pic.twitter.com/Kpa47bDie8
— Ashok Kumar (@bashokkumar_) January 12, 2024
సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా.. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రెండవ భాగానికి శౌర్యంగ పర్వం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సలార్ క్లైమాక్స్ లోనే రివీల్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలో డార్లింగ్ వెల్లడించారు.
The Way He Says ‘ My Mummy ‘ and Bonding With @shrutihaasan 😭❤️👌#Prabhas #Salaar #SalaarSuccessCelebrations pic.twitter.com/3f16nKLsdP
— PrabhasStrength (@PrabhasStrenth) January 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.