Actors : 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ డేటింగ్.. నెట్టింట ఫోటోస్ వైరల్..

సాధారణంగా సినీతారలకు సంబంధించిన పర్సనల్ విషయాలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తారల లవ్, బ్రేకప్ విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ హీరోహీరోయిన్ ప్రేమాయణం గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ సెలబ్రెటీ కపూల్ ఎవరో తెలుసా.. ?

Actors : 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ డేటింగ్.. నెట్టింట ఫోటోస్ వైరల్..
Tom Cruise, Ana De Armas

Updated on: Jul 30, 2025 | 3:12 PM

సాధారణంగా సినీరంగంలోని సెలబ్రెటీలు ప్రేమలో పడడం, డేటింగ్ చేయడం, కలిసి జీవించడం సర్వసాధారణం. ఈమధ్య కాలంలో సెలబ్రెటీ కపూల్స్ డివోర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ హీరోహీరోయిన్ ప్రేమకథ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ నటి అనా డి అర్మాస్ మరో సీనియర్ హీరో టామ్ క్రూజ్ తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల నటించిన మిషన్ ఇంపాజిబుల్.. ది ఫైనల్ రికనింగ్ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలోని పోరాట సన్నివేసానికి టామ్ క్రూజ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. అయితే తాజాగా టామ్ క్రూజ్, అనా ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఆ ఫోటోలలో టామ్ క్రూజ్ నేవీ టీ షర్ట్, డెనిమ్, బేస్ బాల్ క్యాప్ ధరించి క్యాజువల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక అనా వైట్ టీ షర్ట్, బ్లాక్ స్కిన్నీ జీన్స్ ధరించి కనిపించారు. ప్రస్తుతం టామ్ క్రూజ్ వయసు 63 సంవత్సరాలు. ఇక అనా డి అర్మాస్ వయసు 37 సంవత్సరాలు. వీరిద్దరు కలిసి బయట కనిపించడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు ఈ రూమర్స్ పై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..