Vijay Deverakonda: అదిరిందయ్యా రాహుల్! విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్!

గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం మరో హాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్.

Vijay Deverakonda: అదిరిందయ్యా రాహుల్! విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్!
Vijay Deverakonda

Updated on: Nov 28, 2025 | 8:30 AM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఊహించని స్టార్ డమ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘గీత గోవిందం’ తో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అయితే గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్నాడు విజయ్. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ విజయ్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తరవాత వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్, లేటెస్ట్ కింగ్ డమ్ సినిమాలు బాగానే ఆడాయి. అయితే ఇవేవీ విజయ్ రేంజ్ కు తగిన సినిమాలు కావు. ఈ క్రమంలో తనకు ట్యాక్సీవాల వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో మళ్లీ చేతులు కలిపాడు విజయ్. ఓ డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ విలన్ ని తీసుకొస్తున్నారని సమాచారం. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకున్నారు. కనిపించింది కొన్ని నిమిషాలే అయినా మైక్ టైసన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ విలన్ ని తీసుకొస్తున్నారు.

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన దర్శకత్వం వహించనున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఇందులో హాలీవుడ్ నటుడు విలన్ గా నటించనున్నారని సమాచారం. హాలీవుడ్ కల్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాలలో ఒకటైన ‘మమ్మీ’ ఫిల్మ్ సిరీస్‌లో విలన్ అయిన ఆర్నాల్డ్ వోస్లూ, విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని సమాచారం. ఆర్నాల్డ్ వోస్లూ ‘మమ్మీ’లోనే కాకుండా ‘డార్క్ మ్యాన్’, ‘ఏజెంట్ కోడి బ్యాంక్స్’, ‘బ్లడ్ డైమండ్’, ‘ఒడిస్సీ’, ‘ఫైర్ అండ్ ఐస్’, ‘జిఐ జో’, ‘సూపర్ మ్యాన్’, ‘సిల్వర్టన్ సీజ్’ తదితర సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తే అది అతనికి తొలి భారతీయ సినిమా అవుతుంది.

గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ అనే సూపర్ హిట్ సినిమాను రూపొందించాడు రాహుల్. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో జోడీ కట్టాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

Vijay Deverakonda New Movie

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.