Holi Theme Telugu Songs: రంగు రంగుల పండగా.. జీవితానికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే గొప్ప వేడుక హోలీ. ఇక హోలీ పండుగను సినిమా ఇండస్ట్రీని విడతీసి చూడలేం. రంగుల పండుగను వెండితెరపై మరింత శోభను సంతరించుకునేలా చేస్తారు దర్శకులు. మరీ ముఖ్యంగా హోలీ పండుగ నేపథ్యంలో వచ్చే పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఇలా రంగుల వెండి తెరకు మరిన్ని రంగులను అద్దిన కొన్ని తెలుగు సినిమాల పాటలపై ఓ లుక్కేయండి..
ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చక్రం’ సినిమాలో వచ్చే ‘రంగేళీ హోలీ’ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాలోని రంగు రబ్బారబ్బ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఉర్రితలుగిస్తుంది. సుద్దాల అశోక్ తేజ పదాలు సమకూర్చిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్ ఎవర్‌గ్రీన్ హోలీ పాటగా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
హోలీ నేపథ్యంలో వచ్చే పాటల్లో జెమినీ సినిమాలోని ‘దిల్ దివానా’ సాంగ్ ప్రథమ స్థానంలో ఉంటుంది.ఈ పాటలో నమిత స్టె్ప్స్ ఆకట్టుకుంటాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో హోలీ నేపథ్యంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ పాటను హోలీ పండుగ నేపథ్యంలో 2017లో విడుదల చేశారు.
ఈ ఏడాది హోలీ పండుగకు యాంకర్ వర్షిణీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్‌లో ఆడిపాడింది. ఈ పాట ద్వారా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది.
ఇటీవలి కాలంలో తన గాత్రంతో ఆకట్టుకుంటోన్న మంగ్లీ 2019లో హోలీ నేపథ్యంలో ఓ పాటను ఆలపించింది. ‘ఖతర్నాక్ కలర్ జల్లురా’ అనే సాగే ఈ పాటలో పల్లెల్లో హోలీని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చక్కగా చూపించారు.
Also Read: Holi 2021: హోలీ సంబరాల్లో భాంగ్ ఎందుకు తాగుతారో తెలుసా.. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే..
Holi 2021: హోలీ సంబరాలు.. అబ్బాయిల కోసం కొన్ని డ్రెస్సింగ్ ఐడియాస్.. మీరు తెలుసుకోండి..
Holi 2021 : నార్త్ ఇండియాలో హోలీ స్పెషల్.. సంప్రదాయ వంటలు.. తయారీ విధానం