Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయ్యింది. ఈనెల 25న అతడు చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు..
Jani Master

Updated on: Oct 24, 2024 | 12:43 PM

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఓ యువతి గతనెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితోపాటు జానీ మాస్టర్ భార్య కూడా తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు జానీమాస్టర్.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మైనర్ గా ఉన్నప్పటి నుంచే అంటే 2019 నుంచే తనపై లైంగిక దాడి జరిగిందని సదరు యువతి తెలిపింది. దీంతో అతడిపై పోక్స్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబర్ 25న జానీ మాస్టర్ చంచల్ గూడా జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం. ఇదివరకే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us