
అందాల భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ కవ్విస్తున్నారు. చాల మంది హీరోయిన్స్ కు సినిమాల్లో క్రెడిట్ రావడం కష్టమే. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా క్రెడిట్ హీరోల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇంకొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కేవలం పాటలకే పరిమితం అవుతూ ఉంటారు. దాంతో ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఉన్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా..?
కేతిక శర్మ.. ఈ చిన్నది రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. వరుసగా సినిమాలు చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ భామ. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాతో హిట్ అందుకుంది.
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాలోనే ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ తో అదరగోటింది. ఇన్ టెన్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.