samantha – vijay devarakonda: ఖుషి మూవీకి సమంత, విజయ్ రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..?
చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి క్రేజ్, ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కానీ, ఇటీవల లైగర్ తో ప్లాప్ చూసిన విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ఖుషి . త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి క్రేజ్, ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కానీ, ఇటీవల లైగర్ తో ప్లాప్ చూసిన విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ఖుషి . త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇంతకుముందు వీరిద్దరూ మహానటి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అందులో సమంత వెంటపడే ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటే ఖుషి సినిమాలో ప్రేమించి, పెళ్లి చేసుకుని గొడవ పడే భార్యాభర్తలుగా అలరించనున్నారు. ఇక ఈ సినిమాకు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. అయితే ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు డైరెక్టర్ శివ నిర్వాణ పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖుషి సినిమాకు విజయ్ దేవరకొండ 23 కోట్లు తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే సమంత నాలుగున్నర కోట్లు, దర్శకుడు శివ నిర్వాణ 12 కోట్లు తీసుకున్నాడని టాక్. దీంతో నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు అన్ని కోట్లు ఇస్తున్నారా? అంటూ ట్రోలింగ్ మొదలెట్టేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...