
సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. మరికొంతమంది సర్జరీల విషయంలో ట్రోల్ చేస్తుంటారు తాజాగా ఓ హీరోయిన్ ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. సర్జరీల విషయంలో హీరోయిన్ పై ట్రోల్స్.. దానికి ఆ స్టార్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్‌లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌కు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తుంది శ్రుతిహాసన్.
శ్రుతిహాసన్ అందం పై ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆమె అందం కోసం సర్జరీ చేయించుకుందని.. అందుకే ఆమె ఇంత అందంగా ఉందని పలువురు ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆ ట్రోల్స్ పై స్పందించింది శ్రుతి.. రైనో ప్లాస్టి అనే సర్జరీ గురించి, అలాగే లిప్ ఫిల్లర్స్ గురించి మాట్లాడింది. ఇది నా శరీరం, నా ఇష్టం అలానే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.అలాగే రైనో ప్లాస్టి అనేది ముక్కుకు చేసే సర్జరీ.. అంది అందం కోసమే కాదు అంతకు ముందు నా ముక్కుకు గాయం అయ్యింది అనికోసమే సర్జరీ చేయించుకున్నా అని తెలిపింది శ్రుతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి