Shraddha Srinath: అమ్మడి ఎదపై అందమైన టాటూ.. అసలు విషయం చెప్పిన శ్రద్ధ శ్రీనాథ్

జెర్సీ సినిమా మంచి విజయం సాధించడంతో శ్రద్ధ శ్రీనాథ్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా  అనే సినిమాతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లోనూ నటించి అలరించింది శ్రద్ధ శ్రీనాథ్.

Shraddha Srinath: అమ్మడి ఎదపై అందమైన టాటూ.. అసలు విషయం చెప్పిన శ్రద్ధ శ్రీనాథ్
Shraddha Srinath
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2024 | 5:31 PM

శ్రద్ధ శ్రీనాథ్.. ఈ అమ్మడు జెర్సీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. జెర్సీ సినిమా మంచి విజయం సాధించడంతో శ్రద్ధ శ్రీనాథ్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా  అనే సినిమాతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లోనూ నటించి అలరించింది శ్రద్ధ శ్రీనాథ్. ఇక ఇప్పుడు సైందవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 13న సైందవ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ వయ్యారి భామ. శ్రద్ధ శ్రీనాథ్ అభినయంతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళ భాషలతో పాటు మిలన్ టాకీస్ అనే సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు సైందవ్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. సైందవ్ సినిమా తో పాటు తన టాటూ గురించి చెప్పుకొచ్చింది. శ్రద్ధ శ్రీనాథ్ ఎద పై ఓ టాటూ ఉంది. అయితే దాని మీనింగ్ ఏంటి..? ఎవరికోసం వేసుకుందో చెప్పింది ఈ బ్యూటీ. తనకు 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే క్రష్ ఉండేది. అతని వల్ల బీటల్స్ బ్యాండ్ గురించి తనకు తెలిసిందని చెప్పింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూను ఆ అబ్బాయి కోసం వేసుకున్న అని తెలిపింది. ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని చెప్పుకొచ్చింది శ్రద్ధ శ్రీనాథ్.

శ్రద్ధ శ్రీనాథ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..